విశాఖ వాసుల్లో భయాందోళన

VISAKHA PEOPLE ARE WORRIED

విశాఖలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యాపారుల కిడ్నాప్‌లు నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే నగరంలో జరుగుతున్న ఈ కిడ్నాప్ ల వెనుక గ్యాంగులు ఏమైనా ఉన్నాయా? లేదా ఆర్ధిక లావాదేవీల్లోని లొసుగుల్లోనే కిడ్నాప్ డ్రామాలు జరుగుతున్నాయా అనేది పోలీసులకు ప్రశ్నార్ధకంగా మారింది. రెండు రోజుల క్రితం లాలం అప్పలరాజు అనే వ్యక్తిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని ఆటోలో ఎక్కించుకుకొని వెళ్లిపోయారు.
సాగర్ నగర్‌ వైపు తీసుకెళ్లి అప్పలరాజు పొట్టపై, చేతిపై కత్తితో గాయపరిచారు. వ్యాపారిని బెదిరించి అతని చేతికి ఉన్న బంగారు ఉంగరాలతో పాటు మెడలో ఉన్న గొలుసు, జేబులో ఉన్న లక్షా 25 వేల రూపాయలు లాక్కొని రోడ్డు పక్కనున్న పొదల్లో బాధితుడిని తోసేసి వెళ్లిపోయారు.
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న అప్పలరాజు రోడ్డుపైకి చేరుకుని బంధువులకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే వారు హుటాహుటిన అక్కడికి వచ్చి అతన్ని కేజీహెచ్‌కి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
అయితే అయితే బాధితుడు నుండి వివరాలు సేకరించిన పోలీసులకు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అయిన నేపధ్యంలో అప్పలరాజే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా అప్పలరాజు అడ్డంగా దొరికిపోయనట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ లో ఆటోలో అప్పలరాజు ఒక్కడే ఎక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అప్పలరాజుపైనే అనుమానం రావటంలో అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా బంగారం దొరికింది. దీంతో లక్ష రూపాయిల నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పుల బాధలు, ఈఎంఐల నుంచి తప్పించుకోవడానికే అప్పలరాజు ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు భావిస్తున్నారు.