మాజీ ఎమ్మెల్యే అతిథి గృహంలో దొంగలు

ROBBERY IN EX MLA'S GUEST HOUSE

గుంటూరు జిల్లా ఈపూరు మండలం బోడెశంభునివారిపాలెం పరిధిలో ఉన్న తెదేపా జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అతిథి గృహంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. నలుగురు యువకులు ప్రహరీ గేటు తీసుకొని లోపలికి ప్రవేశించారు. వీరిలో ఒకరు మొదటి అంతస్తులోకి వెళ్లి టీవీని తీసుకెళ్లారు. మిగతావారు కింద గది తాళం కోసం వాచ్‌మెన్‌ గది తలుపులు కొట్టగా ఆయన తీయలేదు. వాచ్‌మెన్‌ ఫోన్‌ చేయడంతో బోడెశంభునివారిపాలెం గ్రామస్థులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పారిపోయారు. దొంగలు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్‌లు ధరించి, ఇనుపరాడ్లు, కర్రలు పట్టుకొని ఉన్న దృశ్యాలు సీసీ ఫుటేజీలు కనిపించాయి.
అక్కడే నివాసం ఉంటున్న సహాయకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.