కరోనాతో టీడీపీ నేత మృతి

TDP LEADER DIED BY CORONA

ప్రముఖ వ్యాపావేత్త, టీపీపీ నేత పి.టి రంగరాజన్‌ కరోనాతో మృతి చెందారు. రంగరాజన్‌ మృతికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర సంతాపం తెలిపారు. రంగరాజన్ కుటుంబానికి నేతలు సానుభూతి తెలిపారు. టీడీపీకి ఆయన చేసిన సేవలను టీడీపీ నేతలు కొనియాడారు. రంగరాజన్ రాజకీయాలతో పాటు వ్యాపారరంగాల్లో రాణించారని నేతలు చెప్పారు.
మరోవైపు ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. కేసులతో పాటు మరణాలు కూడా ఏపీని భయపెడుతున్నాయి. గత 24 గంటల్లో 19 మంది మృతి చెందారు. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా, విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.