ఏపీలో కొత్తగా 1,933 క‌రోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,933 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాష్ట్రంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. క‌రోనా టెస్ట్ ల నిర్వ‌హించే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అత్య‌ధికంగా న‌మోద‌వుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 1,933 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు రాష్ర్ట కొవిడ్ కంట్రోల్ రూమ్ వెల్ల‌డించింది. తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 13,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా 328 మ‌ర‌ణాలు సంభ‌వించాయని అధికారులు తెలిపారు. క‌రోనాతో మ‌ర‌ణించిన వారిలో క‌ర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో న‌లుగురు చొప్పున‌, కృష్ణా, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌, చిత్తూరు జిల్లాలో ఇద్ద‌రు, నెల్లూరు, అనంత‌పురం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఒక్కొక్క‌రి చొప్పున మ‌ర‌ణించారు. రాష్ట్రంలో ఇప్ప‌టివర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 15,412 మంది కోలుకున్నారు.