కొండచరియలు విరిగిపడడంతో 37 మంది మృతి

 PEOPLE ARE DIED IN NEPAL

పశ్చిమ నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో శనివారం 15 మంది మృతి చెందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల సంఖ్య 48గంటల్లో 37కు చేరాయని వివరించింది. ఇందులో మైగ్డి జిల్లాలోనే 15 మంది మృతి చెందినట్టు పేర్కొంది. జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభించలేదు. అంతకు ముందు శుక్రవారం నేపాల్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి వేర్వేరు ఘటనల్లో 22 మంది మృతి చెందారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఆర్మీని, పోలీసు సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టేందుకు సమీకరించింది. ఎడతెరిపి లేకుండా లేకుండా కురుస్తున్న వానకు నారాయణి నదితో పాటు ఇతర ప్రధాన నదులు పొంగుతున్నాయి.