కరోనా వల్ల వీళ్ళకి బాగా కలిసొచ్చింది.

CORONA FILLS HAPPINESS TO DELIVERY BOYS

కాలుతున్న ఇంటి మీద వేడి నీళ్లు కాచుకున్నట్టు, కరోనా దెబ్బకి ప్రపంచం అతలాకుతలమవుతుంటే, కొందరిపై సిరుల జల్లు కురుస్తుంది. ఎక్కడా అంటారా? ప్రస్తుతం అమెరికాలో డెలివరీ బాయ్స్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయ తీరున  ఉంది. 
కరోనా వైరస్‌ ప్రభావంతో అమెరికా అల్లాడుతోంది . ఇప్పటికే 70 మంది వరకూ చనిపోయారు . వేల మంది దీని బారిన పడ్డారు . అందుకే కరోనా భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు . ఆఫీసులు కూడా మూతపడ్డాయి . కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు వీలు కల్పించాయి .
ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఆన్ లైన్ వ్యాపారానికి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది . వచ్చే ఆర్డర్లను కస్టమర్లను అందించేందుకు డెలీవరీ బాయ్ లు సరిపోడవడం లేదు .  
అందుకే ఒక డెలివరీ బాయ్ కి, ఒక్క రోజుకే 8000 జీతం .. అంటే నెలకు రెండున్నర లక్షల రూపాయలు .. ఇదెక్కడ చోద్యం అనుకుంటున్నారా ..  మరి ఇది కరోనా తెచ్చి విచిత్రమైన పరిస్థితి. ఇంతకీ ఈ సంచలనం ఆనిర్ణయం తీసుకున్న సంస్థ పేరు తెలుసుకోవాలని ఉందా. అది మరేదో కాదు మనకి బాగా పరిచయమున్న అమెజాన్ సంస్థ. గంటకు వెయ్యి చెల్లిస్తూ, లక్ష మంది వరకు ఉపాధి కలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది.