వందేళ్ల‌లో అతిపెద్ద సంక్షోభం : శ‌క్తికాంత దాస్ 

వందేళ్ల‌లో అతిపెద్ద సంక్షోభం : శ‌క్తికాంత దాస్ 

దేశంలో కరోనా వైరస్ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఇది వందేళ్లలో అతిపెద్ద సంక్షోభమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్బీఐ బ్యాంకింగ్, ఎకనమిక్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడారు. ఆర్థిక స్థిరత్వానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉపాధి, ఇతర రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు. ప్రస్తుతం తమ తొలి ప్రాధాన్యత ఆర్థిక వృద్ధి అని దాస్ చెప్పారు. ఇది మనకు అతిపెద్ద సవాల్ అన్నారు. ప్రతి బ్యాంకు కూడా కోవిడ్ స్ట్రెస్ టెస్ట్ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. వందేళ్లలో ఇది దారుణ సంక్షోభం అన్నారు. ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకు ఆర్బీఐ కీలకమైన, చారిత్రాత్మకమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఆర్బీఐ తీసుకున్న పాలసీచర్యలు ఫలితం ఇస్తున్నాయన్నారు. గతంలో మందగమ‌నం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండేందుకు ఫిబ్రవరి 2019 నుండి ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్ల మేరకు రెపో రేటు తగ్గించిందని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నుండి ఆర్బీఐ రూ.9.57 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు ప్రకటించిందన్నారు. ఇది జీడీపీలో 4.5 శాతం అన్నారు. ఉపాధి, ఇతర రంగాలపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.