ఏపీ ఆర్టీసీ ఎండీగా కృష్ణబాబు

ఏపీ ఆర్టీసీ ఎండీగా కృష్ణబాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్పి బెటాలియన్ అడిషనల్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివాదాస్పద నిర్ణయాలతో ఆర్టీసీకి నష్టం కలిగించడంతోపాటు ఇటు సిబ్బందిని, అటు ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టేలా వ్యవహరించడంతో మాదిరెడ్డిని ప్రభుత్వం లూప్‌లైన్‌కు పంపింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు ఆర్టీసీ ఎండీ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.