జులై 13నుంచి 23వ‌ర‌కు లాక్ డౌన్ 

జులై 13నుంచి 23వ‌ర‌కు లాక్ డౌన్ 

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఉంటున్నాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని పుణెలో జులై 13 నుంచి 23 వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుణెలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అనుమతినిచ్చింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. పది రోజుల వరకూ మళ్లీ మద్యం దుకాణాలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్టాక్ పెట్టుకోవాలని మద్యం ప్రియులు నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ముంబై తర్వాత పుణె జిల్లాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పుణె జిల్లాలో గురువారం ఒక్కరోజే 1,803 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 1,032 కరోనా కేసులు ఒక్క పుణె నగరంలోనే నమోదైన ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్పటివరకూ 978 మంది కరోనా వల్ల మరణించారు.