మళ్ళీ బొమ్మ దద్దరిల్లింది

sarileru neekevvaru straiks again strongly at trp

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బ్లాక్‌బస్లర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నిర్మాతలు ఈ విజయాన్ని బ్లాక్‌బస్టర్ కా బాప్ అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో నటించింది. విలన్‌గా ప్రకాశ్ రాజ్ ఎప్పటిలానే తనదైన నటనతో మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి పోటీగా మరో పెద్ద సినిమా ఉన్నప్పటికీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందీ చిత్రం. ఇక వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా తొలిసారి బుల్లితెరపై ప్రసారమైనప్పుడు ఈ చిత్రం 23.4 టీఆర్పీని సాధించి టాప్ 3 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని రెండోసారి కూడా సదరు చానల్ టెలికాస్ట్ చేసింది.
రెండోసారీ.. ఈ బొమ్మ దద్దరిల్లిపోయే రేటింగ్‌ను రాబట్టుకుంది.
జూన్ 28న రెండోసారి టెలికాస్ట్ అయిన ఈ చిత్రం 17.4 టీఆర్పీని సొంతం చేసుకుంది. సెకండ్ టైమ్ ప్రసారంలో ఇంత టీఆర్పీ రావడం అంటే నిజంగా మాటలు కాదు. అంతేకాదు ఈ చిత్రానికి పోటీగా మరో ఛానల్‌లో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ నటించిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం తొలిసారి ప్రదర్శించబడింది. అయినా కూడా 'సరిలేరు నీకెవ్వరు' టాప్ రేటింగ్‌ను రాబట్టి రికార్డ్‌ను క్రియేట్ చేసింది.