భార‌త్ లో మ‌రో 18,653 క‌రోనా కేసులు 

భార‌త్ లో మ‌రో 18,653 క‌రోనా కేసులు 

భారత్ లో ప్రాణాంతక కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎవ‌రికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత రోజురోజుకు క‌రోనా వైర‌స్ కేసులు వేల‌ల్లో న‌మోదవుతుండ‌డంతో ప్రజలు వణికిపోతున్నారు. మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది బ‌ల‌వుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో క‌రోనాతో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 17,400కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,47,979 మంది బాధితులు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2,20,114 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండ‌డం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.