ఏపీలో అధునాత‌న 108, 104 స‌ర్వీసులు ప్రారంభం 

ఏపీలో అధునాత‌న 108, 104 స‌ర్వీసులు ప్రారంభం 

 జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఆధునాత‌న 108, 104 అంబులెన్స్ లు ప్రారంభ‌మ‌య్యాయి.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పాలన పరంగా దూసుకువెళ్తున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతూ ప్రజల కోసం ఎన్నో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇక తాజాగా 108, 104 అంబులెన్స్‌ లను సీఎం జ‌గ‌న్ విజయవాడలో జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి. ఈ వాహనాల్లో అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా, ప్రమాదానికి, అనారోగ్యానికి గురైన వెంటనే వచ్చే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలు ఏర్పాటు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్ లు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌ లను వినియోగించన్నారు. ఇక కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌ లో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకుసంబంధించినవి కాగా, 104 సర్వీసులు అడ్వాన్స్‌ డ్‌ లైఫ్‌ సపోర్టు గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్‌ లను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు.