మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న వైసీపీ స‌ర్కార్ 

మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న వైసీపీ స‌ర్కార్ 

ఓ వైపు క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వైసీపీ స‌ర్కార్ వైర‌స్ ను లెక్క‌చేయ‌కుండా క‌రోనా టెస్టులను పెంచుతూనే వరుస సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. తాజాగా, పొగాకు రైతులకు శుభవార్త చెప్పింది వైఎస్ జగన్ సర్కార్.. ఇకపై ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇవాళ్టి నుంచి పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని 1, 2 కేంద్రాల ద్వారా ఇవాళ పొగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని.. ఆ తర్వాత అన్ని కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు చేపడుతామని తెలిపారు మంత్రి. ఇక, ఎఫ్‌3, ఎఫ్‌4, ఎఫ్‌5, ఎఫ్‌8, ఎఫ్‌9 గ్రేడు పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన మంత్రి కన్నబాబు.. పొగాకు బోర్డు నిర్ణయించిన దానికంటే ఎక్కువ మొత్తానికి కొనుగోళ్లు చేస్తామన్నారు.