జలదిగ్బంధంలో యాభై గ్రామాలు

electricity and transport interrupted in fifty villages

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వైపు కరోనా కలకలం సృష్టిస్తుంటే, మరో వైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలు కల్లోలాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ వాసుల గుండెల్లో ఈ సంవత్సరం అలజడి రేపుతుందని చెప్పకతప్పదు. మొన్నటికి మొన్న కరోనా, నిన్న గ్యాస్ లీక్, ఇప్పుడు ఏడాతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలు.  

గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో విశాఖ జిల్లాలో యాబై గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జీకే వీధి మండలం దారకొండ-గుమ్మిరేవుల రహదారిలో నీళ్లు నిలిచిపోయాయి.
కొంగపాకల వద్ద రహదారికి గండి పడడంతో... తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులో రాకపోకలు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. మొత్తం యాభై గ్రామాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.