ఏపీలో మ‌రో 704 క‌రోనా కేసులు 

ఏపీలో మ‌రో 704 క‌రోనా కేసులు 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. క‌రోనా టెస్ట్ లు పెరిగే కొద్ది వైర‌స్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,595కు చేరింది. వీరిలో ఏపీకి చెందిన వాళ్లు 648 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు 51 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో ఒకరు కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 187కు చేరింది.మరోవైపు ఏపీలో కొత్త 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.