భారత్‌లో కొత్త‌గా 18,522 క‌రోనా కేసులు 

భారత్‌లో కొత్త‌గా 18,522 క‌రోనా కేసులు 

భారత్‌లో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కేసుల ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైరస్ బారినపడి చ‌నిపోగా, మృతుల సంఖ్య మొత్తం 16,893కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్నది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 86,08,654 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.