అల్లరి నరేశ్ 'నాంది'లో వరలక్ష్మి శరత్ కుమార్

varalakshmi in naandi

ప్రస్తుతం అల్లరి నరేశ్ 'నాంది' అనే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో పోస్టర్ విడుదలైంది.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో లాయర్ గా కనిపించనుంది. ఈ పాత్ర పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ స్టిల్ లో వరలక్ష్మి ఓ చేత్తో ఫైల్, మరో చేతితో నల్ల కోటు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంది. అల్లరి నరేశ్ కేసును వాదించే లాయర్ గా వరలక్ష్మి కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కొత్త డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.