59 చైనా మొబైల్ యాప్‌ల నిషేధం

59 china mobile apps are banned

చైనాతో ఉద్రిక్తతల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది.
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఘర్షణలో 45 నుంచి 50 మంది చైనా జవాన్లు చనిపోయినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. 17 మంది చైనా సైనికుల మృత దేహాలను భారత్ అప్పగించింది. అంతేకాదు తాము బందీగా పట్టుకున్న చైనా కల్నల్‌ను కూడా భారత్ విడుదల చేసింది.
అయితే చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై క్లారిటీ ఇవ్వకుండా దాచుతోంది.
జూన్ 15న తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ యత్నిస్తున్నాయి. అయితే అదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్ కూడా ఎల్‌ఏసీ వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. ఎల్‌ఏసీ వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్ నిఘా ఉధృతం చేసింది.