ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ వారంట్ జారీ

Iran issues arrest warrant for Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ వారంట్ జారీ చేసింది. ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సొలేమాని హత్యకు సంబంధించి ట్రంప్ అరెస్టుకు సహకారం అందించాలని ఇంటర్‌పోల్‌ను కోరింది.
జనవరి మూడున బాగ్దాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రోన్ల ద్వారా సొలేమానిని చంపేశారు. ఈ కేసులో ట్రంప్‌తో పాటు మరో 30 మంది పాత్ర ఉందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ తెలిపారు.

నిందితులపై హత్య, ఉగ్రవాద అభియోగాలు మోపారు. ట్రంప్ పదవీకాలం ముగిశాక అరెస్ట్ చేయాలని ఇరాన్ యోచిస్తోంది. మరోవైపు ఇరాన్ అరెస్ట్ వారంట్‌పై స్పందించేందుకు ఇంటర్‌పోల్ హెడ్ లియోన్ నిరాకరించారు. ట్రంప్‌కు రెడ్ నోటీస్ అయినా జారీ చేయాలని ఇరాన్ ఇంటర్‌పోల్‌ను కోరింది.