అన్‌లాక్‌ -2 నిబంధనలు ప్రకటించిన కేంద్రం

central announce about unlock-2 rules

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది.

అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది.
బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.