బోటు మునిగి 30 మంది మృతి

బోటు మునిగి 30 మంది మృతి

బోటు మునిగి 30మంది మృతిచెంద‌గా, మ‌రి కొంత మంది గ‌ల్లంతైన ఘ‌ట‌న  బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. బ‌ంగ్లాదేశ్ లో ఓ ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో బురిగంగ నదిలో ఈ ప్రమాదం సంభవించింది. 'మార్నింగ్ బర్డ్' అనే పేరున్న బోటు 100 మంది ప్రయాణికులతో వెళుతుండగా, మరో బోటు వెనుకనుంచి ఢీకొంది. దాంతో ఆ బోటు నీటిలో మునిగిపోయింది. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.