మ‌హారాష్ట్ర‌లో జులై 31వ‌రకు లాక్‌డౌన్‌ 

మ‌హారాష్ట్ర‌లో జులై 31వ‌రకు లాక్‌డౌన్‌ 

క‌రోనా కేసులు రోజురోజుకు విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో కొన్ని రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అందులో భాగంగా దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో మ‌హారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు జులై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ఇవాళ‌ మధ్యాహ్నం ప్రకటించింది. ఇందులో భాగంగా 'మిషన్‌ బిగెన్‌ అగైన్‌' పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 5493 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,626 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 86,575మంది కోలుకోగా.. 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం మొత్తంలో 10 నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేస్తామని సీఎం ఉద్ధవ్ తెలిపారు.