భార‌త్ లో కొత్త‌గా 19,459 కరోనా కేసులు

భార‌త్ లో కొత్త‌గా 19,459 కరోనా కేసులు

భార‌త్ లో రోజురోజుకు కరోనా మ‌హ‌మ్మారి కేసులు విజృంభిస్తున్నాయి. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్ర‌కారం గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 380 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు.