సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చి వేసేందుకు హైకోర్టు ఓకే చెప్పింది. సచివాలయం కూల్చి వేయొద్దంటూ హైకోర్టులో దాదాపుగా 10 పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు సుదీర్ఘకాలంగా విచారణ జరిపి, కూల్చివేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కొత్త సచివాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చాలా కాలం క్రితమే సచివాలయాన్ని కూల్చేసి, దాని స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, హైకోర్టులో కూల్చివేతకు సంబంధించిన పిటీషన్లు దాఖలు కావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది.