అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ :  సీఎం కేసీఆర్ 

అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ :  సీఎం కేసీఆర్ 

క‌రోనా గురించి భ‌యాందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంద‌రికీ స‌రైన వైద్యం అందిస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు.  క‌రోనా నివార‌ణ‌కు వ్యూహం ఖ‌రారు చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. జీహెచ్ ఎంసీ ప‌రిధిలో రోజురోజుకు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో కొద్దిరోజులు మ‌ళ్లీ లాక్ డౌన్ విధించాల‌నే ప్ర‌తిపాద‌న‌పై కూడా తుది నిర్ణ‌యం తీసుకుంటామ ‌న్నారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వ‌చ్చినంత మాత్రాన భ‌యాందోళ‌న అవ‌స‌రం లేద‌న్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో తెలంగాణ  ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. లాక్‌డౌన్‌ అనేది చాలా పెద్ద విషయమని.. దీనిపై ప్రభుత్వ యంత్రాగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ సారి లాక్‌డౌన్‌ విధిస్తే.. కఠిన అంక్షలను అమలు చేయనున్నారు.