క‌రోనాతో డాక్ట‌ర్ మృతి

క‌రోనాతో డాక్ట‌ర్ మృతి

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క‌రోనాకు ఎంద‌రో ప్ర‌ముఖులు బ‌ల‌వుతున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రక్షణ కవచంలా పని చేస్తున్న డాక్టర్లు కూడా ఈ మహమ్మారికి బలవుతున్నారు. తాజాగా ఢిల్లీలో ప్రముఖ వైద్యుడు అసీమ్ గుప్తా కరోనాతో మృతి చెందాడు. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో విదులు నిర్వహిస్తూ.. కరోనా బారిన పడి.. మాక్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అసీమ్ గుప్తా అనస్థీషియా వైద్యునిగా గొప్ప పేరు సంపాదించారు.