భారత్‌లో కొత్త‌గా 19,906 మందికి కరోనా

భారత్‌లో కొత్త‌గా 19,906 మందికి కరోనా

భారత్‌లో లాక్ డౌన్ స‌డ‌లింపుల త‌ర్వాత క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. అంతకంత‌కూ క‌రోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.     
ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,095కి పెరిగింది. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు. కాగా, జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 82,27,802 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.