పీవీ న‌ర‌సింహారావు శత‌జ‌యంతి ఉత్స‌వాలు ప్రారంభం 

పీవీ న‌ర‌సింహారావు శత‌జ‌యంతి ఉత్స‌వాలు ప్రారంభం 

 నేడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి. పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. ఆదివారం నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళుల‌ర్పించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌,  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొని పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.