ఉగ్రదాడిలో జవాన్‌ సహా బాలుడి మృతి

ఉగ్రదాడిలో జవాన్‌ సహా బాలుడి మృతి

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రుగుతూనే ఉన్నాయి. దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా జాతీయ రహదారిపై గస్తీ కాస్తున్న సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఇవాళ‌ మధ్యాహ్నం జరిగిన ఈ ఉగ్రదాడిలో ఓ జవానుతో సహా ఓ బాలుడు మృతి చెందినట్లు సీఆర్‌పీఎఫ్‌ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా మరికొంత మంది జవాన్లు, పలువురు స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనూహ్య ఉగ్రదాడితో అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెంటనే ప్రతిదాడికి దిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.