ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మైన ఘ‌ట‌న జమ్ముకశ్మీర్‌లో బారాముల్లా జిల్లాలో చోటుచేసుకుంది. బారాముల్లా జిల్లాలోని సోపేరీ సమీపంలో ఉన్న హార్డ్‌శివా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆర్మీకి చెందిన 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా  గాలింపు చేపట్టారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు గురువారం తెల్లవారుజామున కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నది.  గత 20 రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది.