ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా

ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు కరోనా షాక్‌ తగిలింది. దాయాది దేశ‌మైన‌ పాకిస్తాన్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా వ్యాధిబారిన పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టులోనూ ఈ వైరస్ కలకలం సృష్టించింది. ముగ్గురు ఆటగాళ్లకు వ్యాధి లక్షణాలను గుర్తించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. దీంతో పీసీబీ ఉలిక్కిపడింది. వెంటనే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించి ఆటగాళ్లను అలర్ట్ చేసింది.
కీలక ఆటగాళ్లు హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌లకు ఈ వ్యాధి సోకింది. వీరెవరికీ లక్షణాలు లేకుండానే వ్యాధి బయటపడిందని అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఇంగ్లండ్ తో పర్యటనకు పాక్ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా ముందు వీరికి టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ముగ్గురికి వైరస్ సోకిందని తేలింది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించి వారి సన్నిహితులను క్వారంటైన్ చేశారు. క్రికెటర్లకు కరోనా సోకడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిదీ అఫ్రిదీ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే.