ఈత‌కు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

ఈత‌కు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

నదిలో ఈత‌కు వెళ్లి అందులో మునిగిపోయి ఎనిమిది మంది విద్యార్థులు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది.  చైనాలోని చోంగ్ కింగ్ న‌గ‌రంలో సరదాగా నదిలో ఈతకొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో గల ఓ నదిలో ఈత కొట్టేందుకు పాఠశాల విద్యార్థులు 8 మంది కలిసి వెళ్లారు. ఓ విద్యార్థి ఈత కొడుతూ నదిలో మునిగిపోతుండగా, అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురు విద్యార్థులు నదిలోకి దూకారు. దీంతో 8మంది విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది నదిలో నుంచి 8 మంది బాలుర మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాధ‌చాయ‌లు అలుముకున్నాయి. చనిపోయిన విద్యార్థుల‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.