డెంగీ జ్వ‌రంతో ఐఐటీ విద్యార్థిని మృతి

డెంగీ జ్వ‌రంతో ఐఐటీ విద్యార్థిని మృతి

రానున్న వ‌ర్షాకాలంలో ఇంకెన్ని అంటు వ్యాధులు వ‌స్తాయోన‌ని అధికారులు కంగారు పడుతుండ‌గా.. అంతలోనే డెంగ్యూ రానేవచ్చింది. ఓ విద్యార్థినిని కబళించి మృత్యుఒడికి చేర్చింది. కరోనాని కట్టడి చేయలేక సతమతమవుతున్న ప్రభుత్వాన్ని డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది.
రాష్ట్రంలోని వనపర్తి పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్‌ తండాకు చెందిన సీత్యానాయక్‌ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్‌ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్‌ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు.