రోడ్డు ప్రమాదంలో‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

SOFT ENGINEER DIED IN ROAD ACCIDENT

వినుకొండ పట్టణానికి చెందిన సూదేపల్లి రామకృష్ణ (42) తొలుత అమెరికాలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తిరిగొచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసేవారు. తన కుమారునితో పాటు మరో స్నేహితునితో కలిసి కారులో హైదరాబాద్‌ శివారులోని అవుటర్‌ రింగ్‌ రోడ్డులో వెళుతుండగా మరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామకృష్ణ తండ్రి కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షునిగా పని చేశారు.ఏడాదిన్నర క్రితం భార్య చనిపోవడంతో ముగ్గురు పిల్లలకు అన్నీతానై చూసుకునేవారు. ఇంతలోనే విధి వక్రీకరించి ఆ బిడ్డలకు తండ్రిని కూడా దూరం చేసింది.