ఒంగోలులో భూకంపం

ఒంగోలులో భూకంపం

ఒకవైపు దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న‌ కరోనా నుంచి ఎలా బయటపడాలో తెలియక  ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నారు. మ‌రో వైపు కేసులు పెరుగుతున్న సమయంలో వాతావరణం చల్లబడటం, వర్షాలు కురుస్తుండటంతో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా, వర్షాలు, తుఫానులతో అల్లాడుతుంటే మరోవైపు భూకంపాలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. గత నెల రోజులుగా నార్త్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భూకంపాలు వస్తున్నాయి. అయితే, ఈ భూప్రకంపనలు పెద్దగా లేకపోవడం ఎలాంటి నష్టాలు జరగడం లేదు. కాగా, ఈ భూప్రకంపనలు ఇప్పుడు సౌత్ కి చేరాయి. ఈరోజు ఉదయం 6:55 గంటల సమయంలో కర్ణాటకలోని హంపిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4 గా నమోదైంది. కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు పట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, సుందరయ్య భవన్ రోడ్డులో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణఆస్తి నష్టం సంభవించలేదు. కానీ కాసేపు తాము ఆందోళనకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు.