భారత్‌లో మ‌రో  9,851 మందికి కరోనా నిర్ధారణ

భారత్‌లో మ‌రో  9,851 మందికి కరోనా నిర్ధారణ

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 9851 కేసులు నమోదు కాగా.. 273 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,26,770 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 6,348 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,10,960 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,09,462 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత వారం రోజులుగా దేశంలో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా.. కొన్ని రోజులుగా ప్రతి రోజు 200పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో ఉంది. ఇక కొవిడ్‌-19 మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల జాబితాలో భారత్ 12వ స్థానానికి చేరింది.