బాలయ్యకు తేజ సపోర్ట్

TEJA SUPPORTS BALAYYA

టాలీవుడ్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినిపెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి బాలయ్యను పిలవకపోవడంతో.. మీడియా దీనిపై బాలకృష్ణను ప్రశ్నించింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. భూములు ఏవైనా పంచుకుంటున్నారా? అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలో ఉన్న విభేదాలను, వివాదాలను మరోసారి బహిర్గతం చేసాయి. అందులో కొందరు బాలయ్యకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్యను చర్చలకి ఆహ్వానించకపోవడంపై ఇప్పుడు దర్శకుడు తేజ కూడా స్పందించాడు. మధ్యలో కొందరు వచ్చి ఇండస్ట్రీ తన వల్లే నడుస్తుందని అనుకుంటారని, ఎవరు ఉన్నా లేకున్నా ఇండస్ట్రీ ఉంటుందని తేజా సెటైర్లు వేసాడు.
ఇండస్ట్రీ తరఫున ఏ మీటింగ్ జరిగినా.. పెద్ద వాళ్లందరినీ పిలవాల్సిన అవసరం ఉందని తేజా చెప్పాడు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా చిరంజీవితో పాటు బాలయ్యను కూడా పిలవాలని తేజ అన్నాడు. తన లాంటి వాళ్లు ఎందరో వచ్చిపోతుంటారని.. ఇండస్ర్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఎవరైతే పిల్లర్‌లా ఇండస్ట్రీలో ఉంటారో మీటింగ్‌కు పిలవాలని తేజ అభిప్రాయం వ్యక్తం చేశాడు.