చంద్రబాబు ఎన్ని జ‌న్మ‌లెత్తినా.. అది మాత్రం జ‌ర‌గ‌దు..!    

ambati rambabu sensational comments on chandrababu

వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మ‌రోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ పాల‌న అంతా దోపిడీమ‌యం అని, చంద్రబాబు హయాంలో వేల కోట్లు గంగలో పోశారని, ఆయన పాలనలో దాదాపు 15 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారుని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ బకాయిల‌న్నీ తీర్చార‌ని అంబ‌టి తెలిపారు. 

ఇక చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా తిరిగి అధికారంలోకి రాలేర‌ని అంబ‌టి జోస్యం చెప్పాంరు. కరోనా విషయంలో 4 లక్షల టెస్టులు చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింద‌ని.. కేంద్ర ప్రభుత్వం అభినందించినా చంద్రబాబు మాత్రం జూమ్‌ కూతలు కూస్తున్నార‌న్నారు. న్యాయస్థానాలపై మాకు అపారమైన గౌరవం ఉంద‌ని.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుంద‌ని తెలిపారు. చంద్రబాబు మాకు చెప్పాల్సిన అవసరం లేద‌న్నారు. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, హైదరాబాదులోని ఎల్ బ్లాకు కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు వసూలు చేయాలంటే చాలా ఉంటుందని, వాటి సంగతి చంద్రబాబు మాట్లాడాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.