నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం

నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి పంచాయతీ పరిష్కరించేందుకు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఇవాళ భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో తమ వాదనలను గట్టిగా వినిపించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యాయి... ఇవాళ భేటీకి సంబంధించి ఎజెండా సిద్ధం చేసింది కృష్ణా వాటర్‌ బోర్డు. ఈ సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఏపీ సర్కారు చేపట్టనున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు, డిండి వంటి పలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. అలాగే నీటి కేటాయింపులు, బడ్జెట్ నిధుల విడుదల, టెలీ మెట్రీ యంత్రాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఇప్పటికే లేఖ రాసింది.