జ‌గ‌న్ స‌ర్కార్ త‌ప్పుల‌కు.. రాష్ట్ర ప్ర‌జ‌లు జ‌రిమానా చెల్లించాలా..?

chandrababu comments on ysrcp sarkar

టీడీపీ అధినేత చంద్రబాబు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు రంగుల వ్యవహారంలో ఏపీ ప్ర‌భుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్ర‌మంలో ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన చరిత్ర లేద‌న్నారు. అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.వైసీపీ అడ్డదారి, జ‌గ‌న్ మాయదారి రూట్లో న‌డుస్తున్నార‌ని.. రంగులపై డబ్బులు వృధా అవ‌డ‌మేకాకుండా, మ‌రోవైపు అడ్వకేట్లకు ఫీజులు కూడా వృధానే అన్నారు. ఇప్పుడు  ఆ రంగులు తొలగించడానికి మరోసారి జ‌గ‌న్ స‌ర్కార్ డబ్బులు వృధా చేస్తుంద‌న్నారు. 

ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎవరిచ్చార‌ని ప్ర‌శ్నించారు. తప్పుల‌ మీద తప్పులు చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ కార‌ణంగా రాష్ట్ర‌ ప్రజలు మూల్యం చెల్లించాలా, మీ తప్పుడు పనులకు రాష్ట్రం నష్ట పోవాలా,  మీ మూర్ఖత్వానికి జనం జరిమానా చెల్లించాలా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఇక ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు రంగులు వేసినందుకు, వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుండే వసూళ్లు చేయాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇక గతంలో కూడా ఈ వ్య‌వ‌హారంపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయ‌ని చంద్ర‌బాబు గుర్తుచేశారు.