సూర్యాపేట జిల్లాలో ఇద్దరి ఆత్మహత్య

two people suicide

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన వీరబాబు(35), మాధవి(25) ఇరువురికి మొదటగా వేరే వ్యక్తులతో వివాహం జరిగింది. వీరబాబుకు ఇద్దరు పిల్లలు, మాధవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇరువురి మధ్య ఏర్పడ్డ పరిచయం బలపడి ప్రేమగా మారింది. కలిసి జీవించేందుకు కుటుంబాల వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. సంవత్సరం క్రితం ఇండ్ల నుంచి వెళ్లిపోయిన వీరు తిరిగి నిన్న రాత్రి ఊరికి చేరుకున్నారు. పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరబాబు సంఘటనా స్థలంలోనే చనిపోగా పరిస్థితి విషమంగా ఉన్న మహిళను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని కూడా పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.