మే 31 ఉదయం 9:09కు మహేష్ బాబు 27

mahesh 27th movie announcement

మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించిన ఊహాగానాలు లాక్ డౌన్ సమయం మొత్తం కొనసాగాయి. పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని ముందే చాలా మంది ఊహించగా.. ఈ మధ్యనే మహేష్ తో చేయబోయే సినిమాను కన్ఫర్మ్ చేశాడు పరశురామ్. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు 27 సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మే 31 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 'సర్కార్ వారి పాట' అంటూ ఇప్పటికే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. అందుకు తగ్గట్టుగా పేపర్, పెన్ను, స్టాంప్ కనిపిస్తూ ఉన్నాయి.
మే 31 సాయంత్రం 5గం.లకి మహేష్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వనున్నారు. మహేష్ బాబు ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. పలు పోస్టులను పెడుతూ ఉన్నారు. అయితే ఆయన లైవ్ రావడం కానీ.. అభిమానులతో ముచ్చటించడం కానీ జరగలేదు.