శ్రీకాకుళం జిల్లాలో తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ

fight between tdp and ysr partiess

శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి బోరుబావి విషయంలో తెదేపా, వైకాపా మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతతకు దారితీసింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. ఘర్షణ నేపథ్యంలో పందిగుంట గ్రామంలో ఉన్నతాధికారులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.