కరోనా ఎఫెక్ట్ : పలు దేశాలకు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు

కరోనా ఎఫెక్ట్ : పలు దేశాలకు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయిల్, శ్రీలంకకు వెళ్లే విమాన సేవలు తగ్గించిన‌ట్లు సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులున్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది. భారత్ ఇద్దరు కరోనా వైరస్ సోకి మృతి చెందినట్లు నిర్ధారించారు.ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.