నెల్లూరు వారం రోజుల్లో గ్రీన్ జోన్ జిల్లాగా మారుతుంది

MINISTER ANIL SAID WITH IN ONE WEEK NELLORE IN GREEN ZONE

రానున్న వారంరోజుల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చి నెల్లూరు జిల్లా సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి కరోనా కేసులు, అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై స్థానిక జెడ్పీ కార్యాలయంలోమంత్రి సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులకు రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి భోజనం, వసతి కల్పించాలన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరో 90 కేసులు కోయంబేడు మార్కెట్‌ లింకులతో వచ్చాయన్నారు.
వీటిలో 70 కేసుల వరకు సూళ్లూరుపేట పట్టణంలోనే ఉన్నాయన్నారు. అధికారులు తీసుకున్న చర్యలు, డాక్టర్లు చేస్తున్న నాణ్యమైన వైద్యం వల్ల రోగులు త్వరితగతిన కోరుకుంటున్నారని తెలిపారు.