ఆది కెరీర్ లో మైలురాయి "బ్లాక్"

ADI'S NEW MOVIE BLACK

మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్ తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని మరియు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తిచేసుకుంది. మిగతా బ్యాలన్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ తరువాత పూర్తిచేసి విడుదలకి చేయటానికి నిర్మాత సన్నాహలు చేస్తున్నారు.

హీరో ఆదికి గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ కోణంలో కొత్తగా ఉంటుంది, ఈ చిత్రం ఆది కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాము. ఆది సాయికుమార్ అభిమానుల, సిని ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని అని నిర్మాత అన్నారు.