శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున

NAGARJUNA ACT IN SEKHAR KAMMULA'S MOVIE

శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి లతో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కానీ లవ్ స్టోరీ మూవీ కథ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరితే దానికి వెంటనే ఒప్పుకున్నాడట శేఖర్.
ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కూడా శేఖర్ కమ్ముల స్టైల్ లోనే ఉండబోతుందట!. ఈ ప్రతిపాదనకు నాగార్జున నుండి కూడా సానుకూల స్పందన వచ్చిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుంది.