వైవిధ్య పాత్రలో కనిపించనున్న మహేష్ బాబు

MAHESH ACT AS A BLIND PERSON

ఎక్కువగా తను నటించే సినిమాల్లో వైవిధ్యం చూపించే విధంగా ప్రయత్నాలు చేసే హీరోగా మహేష్ బాబు ప్రధమ స్థానంలో ఉంటాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం మహేష్ బాబు తీవ్రంగా కష్టపడుతున్నాడు అని తెలుస్తోంది. మహేష్ నటించబోతున్న చిత్రంలో ఒక కన్ను కనపడని వాడిగా, మానసిక రోగిగా కూడా నటిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. 
మహేష్ కి ప్రయోగాలు కొత్తేమి కాదు, ఇప్పటికే మురారి, టక్కరి దొంగ, ఒక్కడు, నిజం, నాని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనొక్కడినే లాంటి సినిమాలతో వైవిధ్యానికి తెలుగులో తెర తీసిన కథానాయకునిగా చరిత్ర సృష్టించాడు. ఫలితాలతో సంబంధం లేకుండా తన ప్రతి చిత్రంలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకి అందించే సూపర్ స్టార్ ఈ సారి తన అభిమానులకి ఎలాంటి అనుభూతిని ఇస్తాడో వేచి చూడాల్సిందే.