వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి

 వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఆపరేషన్‌ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌వో ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు తెలిపారు.