సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం

సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం

ప్రముఖ సీనియర్ నటి వాణి శ్రీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాణిశ్రీ తనయుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ శుక్రవారం ఉదయం నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. రీసెంట్‌గా అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో కార్తీక్ మెడిసన్ చదువుతున్నారు. ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. రాత్రి కుమారుడితో సరదాగా గడిపిన ఆయన ఉదయం ఇలా గుండెపోటుతో హఠాన్మరణం చెందారని సన్నిహితులు చెబుతున్నారు.
వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభినయ్ సతీమణి కూడా వైద్యురాలే కాగా, ఆమె సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో పని చేస్తోందని సమాచారం. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని అంటున్నారు. అభినయ్ హఠాన్మరణంతో వాణిశ్రీ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు . సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అభినయ్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.